Stealing Shoes | ఫుడ్ డెలివరీ బాయ్ చేతివాటం.. ఇంటి ముందు ఉంచిన షూ చోరీ.. VIDEO
Stealing Shoes | ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి ఓ డెలివరీ ఏజెంట్ (Swiggy Agent) చేతివాటం ప్రదర్శించాడు. ఇంటి ముంగిట ఉంచిన ఖరీదైన షూను (Stealing Shoes) దొంగలించుకుపోయాడు.
Stealing Shoes | ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి ఓ డెలివరీ ఏజెంట్ (Swiggy Agent) చేతివాటం ప్రదర్శించాడు. ఇంటి ముంగిట ఉంచిన ఖరీదైన షూను (Stealing Shoes) దొంగలించుకుపోయాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నోయిడా సెక్టార్ 73లోని ఓ అపార్ట్‌మెంట్‌కు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ బాయ్.. ఓ ఫ్లాట్ బయట ఉంచిన షూని దొంగలించాడు. మెట్లు దిగుతూ షూను తన బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటికి షూ కనిపించకపోవడంతో నివాసితులు సీసీటీవీ ఫుటేజ్‌ని తనిఖీ చేశారు. అప్పుడే స్విగ్గీ డెలివరీ బాయ్ నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#Noida– चोरी की अनोखी घटना आई सामने,घर के बाहर रखे हुए जूते चुराकर #Swiggy का डिलीवरी बॉय आसानी से हुआ फरार,चोरी की सारी वारदात घर के बाहर लगे हुए #CCTV कैमरे में हुई कैद,सेक्टर-73 में डिलीवरी बॉय ने घटना को अंजाम दिया।@Uppolice @noidapolice pic.twitter.com/9t3oNx0IDW
— Siddharth Agarwal 🇮🇳 (@siddharth2596) September 17, 2024
కాగా, ఇలాంటి ఘటనే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒకటి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గురుగ్రామ్‌లో స్విగ్గీ (Swiggy) ఇన్‌స్టామార్ట్ డెలివరీ ఏజెంట్ పార్శిల్‌తో ఓ ఇంటికి వెళ్లి.. అక్కడ నైక్ కంపెనీకి చెందిన ఖరీదైన షూను దొంగలించుకుపోతాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. అప్పుడు సదరు స్విగ్గీ బాయ్‌కి ప్రముఖ నటుడు సోనూ సూద్ అండగా నిలిచారు.
Swiggy’s drop and PICK up service. A delivery boy just took my friend’s shoes (@Nike) and they won’t even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx
— Rohit Arora (@_arorarohit_) April 11, 2024
అతడిపై కంపెనీ కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోరాడు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పెట్టాడు. ‘స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ సమయంలో ఏదైనా ఇంటి ముందు షూ చోరీ చేస్తే.. అతడిపై చర్యలు తీసుకోకండి. బదులుగా కొత్త షూ కొనివ్వండి. అతడికి అవి అవసరం కావొచ్చు. దయగా ఉండండి’ అంటూ పోస్టులో రాసుకొచ్చారు.
If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏
— sonu sood (@SonuSood) April 12, 2024
Also Read..
Kolkata | కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా మనోజ్ వర్మను నియమించిన బెంగాల్ ప్రభుత్వం
Gujarat | షూ వదలమన్నందుకు.. వైద్యుడిపై రోగి బంధువు దాడి
Bengaluru | పాఠశాల బస్సుపై దాడి.. అద్దాలు ధ్వంసం.. వైరల్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

