Caste Census | బీహార్ (Bihar)లో నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో కుల ప్రాతిపదికన సర్వే (Caste survey) నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను మంగళవారం కోర్టు కొట్టివేసింది.
ఈ ఏడాది జనవరిలో బీహార్ ప్రభుత్వం ఈ సర్వేను ప్రారంభించింది. మొదటి దశ జనవరి 7-21 తేదీల మధ్య ముగియగా.. రెండో సర్వే ఏప్రిల్ 15న మొదలై మే 15 తో ముగియాల్సి ఉంది. అయితే, వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఈ సర్వేను నిరోధించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ పార్థసారథి ధర్మాసనం పిటిషన్లను కొట్టేసింది. అయితే, పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాది దిను కుమార్ తెలిపారు.
Also Read..
Delhi services bill | ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళన
Sidhu Moose Wala | మూసేవాలా హత్య కేసులో మరో కీలక నిందితుడిని భారత్ కు తీసుకొచ్చిన అధికారులు