Asaduddin Owaisi | ఒవైసీ ఇంటిపై దాడి.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
Asaduddin Owaisi | దేశరాజధాని ఢిల్లీలోని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ (Hyderabad MP) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై (Delhi home) ఇటీవలే దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
Asaduddin Owaisi | దేశరాజధాని ఢిల్లీలోని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ (Hyderabad MP) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై (Delhi home) ఇటీవలే దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అశోక్ రోడ్డులోని ఒవైసీ నివాసంపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు. దీంతోపాటు పోస్టర్లు కూడా అతికించారు. అందులో భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలు రాసి ఉన్నాయి.
ఈ ఘటనపై ఒవైసీ లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు పిర్యాదు చేయడంతో ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్కు సమన్లు జారీ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 143, 147, 506, 153 వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
పిరికిపంద చర్యలకు భయపడేదిలేదు : ఒవైసీ
దాడి ఘటనపైఒవైసీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు తాను భయపడేది లేదని చెప్పారు. ఢిల్లీలోని నివాసాన్ని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో లెక్కేలేదన్నారు. ఇది ఎలా జరుగుతుందని ఢిల్లీ పోలీసు అధికారులను అడిగితే వారు నిస్సహాయత వ్యక్తం చేశారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. ఎంపీల భద్రతకు సంబంధించి ఏం హామీ ఇస్తారో చెప్పాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఇలాంటివి తనను భయపెట్టవని, పిరికి చర్యలను ఆపాలని స్పష్టం చేశారు.
Also Read..
Rajkot airport | నిన్న ఢిల్లీ.. ఇవాళ రాజ్కోట్ ఎయిర్పోర్ట్.. కూలిన టెర్మినల్ పైకప్పు
Anant Weds Radhika | అనంత్ – రాధికల పెళ్లి వేళ.. సామూహిక వివాహాలకు ప్లాన్ చేసిన అంబానీ ఫ్యామిలీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

