ముంబై: ముంబై మహానగరంలో నీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. మునుపెన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడటంతో నగరంలో కారు వాష్పై నిషేధం విధించారు. నగరంలో ఎవరైనా నీటిని వృథా చేసినా, దుర్వినియోగం చేసినా.. కఠినమైన జరిమానా విధిస్తామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తాజాగా ఆదేశాలు జారీచేసింది. మంగళవారం నాటికి ముంబై మహానగరానికి నీటిని సరఫరా చేస్తున్న సరస్సుల్లో మొత్తం నీటి నిల్వలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోయాయి.