న్యూఢిల్లీ, మార్చి 1: ఎఫ్ఆర్సీఏ నిబంధనలు పాటించలేదనే కారణంతో సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్ (సీపీఆర్) సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్ఆర్సీఏ) లైసెన్సును రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకొన్నది. 1973లో ఏర్పడిన ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్నది. ప్రస్తుత కాలంలో ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారానికి శాస్త్రీయ అధ్యయనం ద్వారా సూచనలు చేస్తూ ఉంటుంది. గత సెప్టెంబరు నెలలో సీపీఆర్లో ఐటీ శాఖ సర్వే చేసింది. విదేశీ నిధులకు సంబంధించి సీపీఆర్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించి, ఇప్పుడు దాని లైసెన్సు రద్దు చేసినట్టు తెలుస్తున్నది.