హైదరాబాద్, మే 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బర్డ్‌ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్1) సోకిన ఆవుల పచ్చి పాలను అలాగే తాగితే, మనుషులకు కూడా ఆ వైరస్ సోకే ప్రమాదమున్నది. ఈ మేరకు అట్లాంటాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) పరిశోధకులు తెలిపారు.
వైరస్ సోకిన ఇలాంటి జంతువుల పాలను, పాల పదార్థాలను డైరెక్ట్‌గా తీసుకోవడం మానుకోవాలని, పాశ్చరైజేషన్ చేశాకే వాటిని వినియోగించాలని సూచించారు. అమెరికాలో తొమ్మిది రాష్ర్టాల్లోని 49 ఆవుల మందలపై జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయం వెల్లడైనట్టు వివరించారు.