e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home Top Slides పులుల లెక్క ఇలా!.. డిసెంబర్‌-జనవరిలో ఐదో విడత గణన

పులుల లెక్క ఇలా!.. డిసెంబర్‌-జనవరిలో ఐదో విడత గణన

  • ప్రత్యేక పద్ధతుల్లో లెక్కల సేకరణకు కసరత్తు
  • దేశవ్యాప్తంగా ఒకే వారంలో లెక్కింపు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (నమస్తేతెలంగాణ): అడవికి రారాజు సింహం అంటారు కానీ.. నిజానికి అసలైన రాజు పెద్దపులి. అడవిలో పెద్దపులి ఠీవిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతటి భారీ జంతువైనా భయంతో బిక్కచచ్చిపోవాల్సిందే. ఇప్పుడు మనదేశంలోని అడవులను పెద్దపులులే ఏలుతున్నాయి. అయితే, దేశంలో పులులు ఎన్ని ఉన్నాయి? వాటిని ఎలా లెక్కిస్తారు? అనే కుతూహలం చాలామందిలో ఉంటుంది. దట్టమైన అడవుల్లో ఉండే పులులను లెక్కించటం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. కొన్ని వేలమంది అడువుల్లో కష్టపడి సేకరించిన సమాచారంతో పులుల లెక్కలు తేలుస్తారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డిసెంబర్‌-జనవరి నెలల్లో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో 5వ విడత జాతీయ పులుల గణన చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో పులుల గణనకు అనుసరించే పద్ధతుపై ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం.

పులుల లెక్కింపు ఇలా..
మనదేశంలో ప్రతి నాలుగేండ్లకోసారి వన్యప్రాణుల గణన నిర్వహిస్తారు. పెద్దపులి, చిరుత, అడవికుక్కలు, అడవి పిల్లులు, తోడేలు, నక్కలు, ఎలుగుబంటి వంటి జంతువుల సంఖ్యను అంచనా వేస్తారు. అడవులను బీట్లుగా వర్గీకరిస్తారు. దేశంలో సుమారు 45 వేల ఫారెస్ట్‌ బీట్లు ఉన్నాయి. ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం రాష్ర్టాల అటవీశాఖల ఆధ్వర్యంలో పులుల గణన జరుగుతుంది. తెలంగాణలోని 3,038 ఫారెస్ట్‌ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఇందులో సుమారు 9 వేలమంది పాల్గొంటారు. పులుల లెక్కింపు దేశం మొత్తం ఒకే సమయంలో వారంపాటు నిర్వహిస్తారు.

ప్రతి టీంలో ముగ్గురు సభ్యులు

  • ప్రతి బీట్‌లో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనిలో ఒక ఫారెస్ట్‌ అధికారితో పాటు మరో ఇద్దరు ఉంటారు.
  • మొదటి మూడు రోజులు 5 కిలోమీటర్ల దూరం చొప్పున ఆగకుండా నడుస్తూ అన్వేషించాలి. ఆ మార్గంలో పులుల కాలిముద్రలు, మలం పెంటికలు, మూత్ర విసర్జన, రాలిపడిన వెంట్రుకలు, తిని వదిలిన కళేబరాలు, చెట్లపై, నేలపై గోర్లతో గీసిన గుర్తులు, అరుపులు, ప్రత్యక్షంగా చూడటం వంటి అంశాలను సేకరించాలి. అడవిలో ఏర్పాటుచేసిన ట్రాప్‌ కెమెరాల డేటాను తీసుకొని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ‘వైల్డ్‌లైఫ్‌ యాప్‌’లో నమోదు చేయాలి.
  • 4, 5, 6వ రోజుల్లో రోజూ రెండు కిలోమీటర్లు ఒకే మార్గంలో వెళ్తూ 15 చదరపు మీటర్ల సర్కిల్‌లో శాకహార జంతువుల గణన జరుపుతారు. 15 మీటర్ల విస్తీర్ణంలో చెట్ల ఒత్తిడి, మనుషుల సంచారం, పొదల జాతులు, గడ్డిజాతులు, పశువుల సంచారం, ఆవా సం రక్షణ, చెట్ల నరికివేత, భూ ఆక్రమణ వంటి అం శాలను సేకరిస్తారు. కంటికి కనిపించే శాఖాహార జంతువుల సంఖ్యను ఎన్టీసీఏ రూపొందించిన పత్రంలో నమోదు చేస్తారు.
  • ఆరు రోజులు సేకరించిన వీడియోలు, ఫొటో లు, ఇతర సమాచారాన్ని ఏడోరోజు ‘వైల్డ్‌లైఫ్‌ యాప్‌’లో పొందుపరచి డీఎఫ్‌వోలకు అందజేస్తా రు. అవి పీసీసీఎఫ్‌కు, అటునుంచి డెహ్రాడూన్‌లోని ఎన్టీసీఏకు వెళ్తాయి.
  • అన్నిరాష్ర్టాల నుంచి వచ్చిన సమాచారాన్ని దాదాపు 6-8 నెలలపాటు అధ్యయనం పులుల లెక్కలను ప్రకటిస్తారు. పులుల గణనకోసం అటవీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement