Watch: టీచర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు యువకుడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Youth Tries To Marry School Teacher | ప్రభుత్వ స్కూల్ టీచర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. ఆమె తలపై సింధూరం పెట్టాడు. యువతి తండ్రి అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: ప్రభుత్వ స్కూల్ టీచర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. ఆమె తలపై సింధూరం పెట్టాడు. (Youth Tries To Marry School Teacher) యువతి తండ్రి అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని బంకా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఒక మహిళ స్కూల్ తర్వాత తండ్రితో కలిసి బైక్‌పై ఇంటిని తిరిగి వెళ్తున్నది.
కాగా, ముఖానికి ముసుగు ధరించిన యువకుడు వారిని అడ్డుకున్నాడు. నాటు తుపాకీతో బెదిరించాడు. టీచర్‌ను పెళ్లాడేందుకు ప్రయత్నించగా తండ్రి ప్రతిఘటించాడు. ‘ఆమె వల్ల నేను నాశనమయ్యా. ఆమెను విడిచిపెట్టను’ అని యువకుడు అరిచాడు. బలవంతంగా మహిళ తలపై సింధూరం పెట్టాడు. ఆ యువకుడితో పాటు ఉన్న వ్యక్తి మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు.
కాగా, ఈ సంఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బభంగమాలో నివసించే సౌరభ్ సోను పెళ్లి పేరుతో తన వెంటపడి వేధిస్తున్నాడని ఆరోపించింది. రెండు నెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడికి వార్నింగ్ ఇచ్చారని తెలిపింది. అయినప్పటికీ తనను వేధించడం మానుకోని సౌరభ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఆ యువకుడి వెంట ఉన్న వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बिहार :बीच सड़क BPSC टीचर की भरी मांग :युवक बोला- 8 साल साथ रही आज दोनों मरेंगे, पिता के साथ स्कूल से लौट रही थी युवती#Bihar #Banka #Biharnews pic.twitter.com/5q3PDWF5qm
— FirstBiharJharkhand (@firstbiharnews) June 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

