Online Scam | ఫేస్బుక్ వేదికగా వ్యాపారికి వల : రూ. 95 లక్షలు కొట్టేసిన మహిళ
Online Scam : ఆన్లైన్ వేదికగా రోజుకో తరహా స్కామ్ బయటపడుతోంది. కొరియర్ స్కామ్, పార్ట్‌టైం జాబ్ స్కామ్ ఇలా ఆన్లైన్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు.
Online Scam : ఆన్లైన్ వేదికగా రోజుకో తరహా స్కామ్ బయటపడుతోంది. కొరియర్ స్కామ్, పార్ట్‌టైం జాబ్ స్కామ్ ఇలా ఆన్లైన్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ఇక లేటెస్ట్గా ఫేస్బుక్లో పరిచయమైన మహిళ గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను రూ. 95 లక్షలకు ముంచేసిన ఘటన వెలుగుచూసింది. అల్కాపురికి చెందిన బిజినెస్మెన్ దేశాయ్‌కి ఓ అపరిచిత మహిళ నుంచి ఫేస్బుక్ రిక్వెస్ట్ రాగా యాక్సెప్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో ఎఫ్బీ వేదికగా స్టెఫ్ మిజ్ అనే మహిళ ఆయనకు పరిచయమైంది.
ఆపై ఇద్దరూ తరచూ చాట్ చేస్తూ వాట్సాప్‌లోనూ ముచ్చటించుకునేవారు. ఇద్దరి మధ్య వర్చువల్ ఫ్రెండ్షిప్ బలపడటంతో స్టెఫ్ ఓ స్టెప్ ముందుకేసి భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉందని దేశాయ్‌ను మభ్యపెట్టింది. భారత్ నుంచి తమ కంపెనీకి హెర్బల్ ఉత్పత్తులు అవసరమని వాటికి దళారీగా వ్యవహరిస్తూ పెద్దమొత్తంలో ఆర్జించవచ్చని దేశాయ్‌ను ప్రలోభాలకు గురిచేసింది. ఈ ఉత్పత్తులను ప్యాకెట్‌కు రూ లక్షకు కొనుగోలు చేసి తమ కంపెనీకి రెట్టింపు మొత్తానికి విక్రయించవచ్చని నమ్మబలికింది. ఇది లాభసాటి వ్యాపారంగా భావించిన దేశాయ్ అందుకు అంగీకరించారు.
ఉత్పత్తుల సేకరణ కోసం డాక్టర్ వీరేంద్ర అనే వ్యక్తిని దేశాయ్‌కు మహిళ పరిచయం చేసింది. వారి మాటలను నమ్మిన దేశాయ్ హెర్బల్ ప్రోడక్ట్స్ శాంపిల్ ప్యాకెట్ కోసం రూ. లక్ష వీరేంద్ర ఖాతాకు బదలాయించారు. శాంపిల్ ప్యాకెట్స్‌ను ఓపెన్ చేయవద్దని వారించడంతో వాటిని వెంటనే దేశాయ్ ఓపెన్ చేయలేదు. ఆపై అధిక లాభాల ఆశ చూపి పలు కారణాలను చూపుతూ దేశాయ్ నుంచి పెద్దమొత్తంలో వీరేంద్ర వివిధ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయించుకున్నాడు. ఆపై మరికొంత డబ్బును వీరేంద్ర డిమాండ్ చేయడంతో దేశాయ్ మోసపోయానని గ్రహించారు. తాను చెల్లించిన డబ్బును రిఫండ్ చేయాలని దేశాయ్ స్కామర్లను నిలదీయడంతో వారు కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేసుకున్నారు. ఇక శాంపిల్ ప్యాకెట్స్‌ను దేశాయ్ ఓపెన్ చేయగా అందులో ఫ్రైడ్ చిప్స్, మత్తు పదార్ధాలు ఉండటంతో దేశాయ్ కంగుతిన్నారు. నిందితులు వీరేంద్ర, స్టెఫ్ మిజ్పై దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More :
BS Yediyurappa | మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

