BS Yediyurappa | మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏండ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 2న ఓ చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తన 17 ఏండ్ల కుమార్తెతో కలిసి యడియూరప్ప దగ్గరకు వెళ్లామని, ఆ సమయంలో లైంగిక దాడి జరిగనట్లు బాలిక తల్లి అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందిచంలేదు.
కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయనపై ఈ ఆరోపణలు రావడం సర్వత్రా చర్చ జరుగుతున్నది. 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత జూలై 2019-2021 మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2021, జులైలో బీజేపీ అధిష్టానం యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం ఆయన కుమారుడు విజయేంద్ర యడియూరప్ప రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

