Bulldozer @ Dowry | కూతురికి కట్నంగా బుల్డోజర్.. సెల్ఫీలు తీసుకుంటున్న జనం
Bulldozer @ Dowry | ఓ తండ్రి తన కూతురికి కట్నం కింద బుల్డోజర్ను ఇచ్చారు. ఈ కానుకను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి బుల్డోజర్తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కారు కాకుండా బుల్డోజర్ ఇవ్వడం వలన ఆదాయం సమకూర్చుకోవచ్చునని తండ్రి వాదన.
Bulldozer @ Dowry | ఏ తండ్రి అయిన తన కూతురు-అల్లుడు పెండ్లయ్యాక సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అడిగినా, అడగకున్నా తమ తాహతు కొద్దీ కట్నకానుకలు ఇస్తుంటారు. కొందరు కార్లు, మోటర్ బైకులు కట్నంగా ఇస్తుండగా.. మరికొందరేమో ఇంట్లో ఉపయోగించే సామగ్రి సర్దుతుంటారు. అయితే, ఓ తండ్రి తన కూతురికి ఏకంగా బుల్డోజర్ను కట్నంగా ఇచ్చి అందర్నీ ఆచ్చర్యపరిచాడు.
హమీర్పూర్ జిల్లాలోని సుమెర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌గావ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ జవాన్ పరశురామ్ ప్రజాపతి తన కుమార్తె నేహాకు నౌకాదళంలో పనిచేస్తున్న సౌఖర్ గ్రామానికి చెందిన యోగేంద్ర అలియాస్ యోగి ప్రజాపతితో వివాహం నిశ్చయించారు. పట్టణంలోని శివ మ్యారేజ్ గార్డెన్లో ఈ నెల 15 న వివాహ వేడుక జరిపారు. వివాహంలో తన కుమార్తె నేహాకు కట్నంగా బుల్డోజర్ను పరశురామ్ అందించాడు. బుల్డోజర్ను కానుకగా ఇవ్వడం వెనుక తండ్రి పరశురామ్ వాదన మరోలా ఉన్నది. తన అల్లుడికి కారు కట్నంగా ఇస్తే ఇంటి ముందు నిలబడి ఉంటుందని, అదే బుల్డోజర్ అయితే ఆదాయం తెచ్చిపెడుతుంది అని చెప్తున్నారు. తాను సివిల్ సర్వీస్‌కు సిద్ధమవుతున్నందున ఖర్చుల కోసం భర్తను డబ్బు అడగాల్సిన అవసరం లేద చెప్తున్నది వధువు నేహా.
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ ట్రెండ్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. హమీర్పూర్ జిల్లాలోని ఈ అపూర్వ వివాహ కానుక ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పెండ్లి వేడుక వేదిక వద్ద అమ్మాయి తండ్రి తన కాబోయే అల్లుడికి బెలూన్లతో అలంకరించిన కొత్త బుల్డోజర్ను అందజేశాడు. పెండ్లిలో కట్నంగా బుల్డోజర్ పెట్టారనే వార్త గుప్పుమనగానే.. ఈ పెండ్లిని చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. బుల్డోజర్ను చూసి చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

