లక్నో: ఒక ఆవును ఎద్దు వెంబడించింది. దీంతో ఆ ఆవు ఒక ఇంట్లో ఉన్న బెడ్రూమ్లోకి వచ్చింది. ఆ ఎద్దు కూడా దానిని అనుసరించింది. (Bull Chases Cow Into Bedroom) ఇది చూసి ఆ ఇంట్లోని వారు భయాందోళన చెందారు. చివరకు పలు ప్రయత్నాల తర్వాత వాటిని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. మార్చి 26న ఉదయం వేళ ఒక ఇంట్లోని వారు తమ పనుల్లో బిజీగా ఉన్నారు.
కాగా, ఆ వీధిలో ఆవు వెనుక ఎద్దు వెంటపడింది. దీంతో గేటు తెరిచి ఉన్న ఇంట్లోకి ఆవు దూసుకొచ్చింది. నేరుగా బెడ్రూమ్లోకి అది వెళ్లింది. ఎద్దు కూడా దాని వెంటపడింది. అక్కడున్న బెడ్ మీదకు ఎక్కింది. ఇది చూసి ఆ ఇంట్లో ఉన్న మహిళ భయపడింది. బీరువా వెనుక ఆమె దాక్కున్నది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. బెడ్రూమ్లో ఉన్న ఆవు, ఎద్దును బయటకు పంపేందుకు పలు ప్రయత్నాలు చేశారు. నీళ్లు చల్లారు. కర్రలతో బెదరించారు. బాణసంచా పేల్చారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు పాల డైయిరీలో పని చేసే వ్యక్తి ఆవు, ఎద్దును ఆ ఇంటికి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#फरीदाबाद में बुधवार को गाय और सांड एक घर में घुस गए।महिला ने आलमारी में 2 घंटे तक छिपकर अपनी जान बचाई। बड़ी मुश्किल से पशुओं को घर से निकाला जा सका।#faridabad pic.twitter.com/TxpvmKnQ01
— ITM MEDIA 24 (@itmmedia24) March 27, 2025