New Delhi : ఢిల్లీలో బిల్డింగ్స్ వరుసగా కూలిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో బిల్డింగ్ ఢిల్లీలో కూలిపోయింది. ఈశాన్య ఢిల్లీ, సీమాపురి ప్రాంతంలో అక్టోబర్ 7, బుధవారం మధ్యాహ్నం నాలుగంతస్తుల బిల్డింగ్కు సంబంధించిన ముందు భాగం కూలిపోయింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఢిల్లీలోని ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందింది.
వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పలు ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఆలోపే స్పందించిన స్థానికులు శిథిలాల కింది నుంచి ఇద్దరు చిన్నారులను బయటకు తీశారు. శిథిలాల కింద ఇంకో ఐదుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. 25 చదరపు గజాల స్థలంలో ఈ బిల్డింగ్ ఉందని, కింద కొన్ని షాపులు ఉన్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.
A five-storey residential building collapsed in Delhi’s Seemapuri area on Wednesday, with several people feared trapped under the debris.
A family member said the building was evacuated after the earthquake, but people were gradually returning when it suddenly collapsed around 3:30 pm.
Delhi Police and fire brigade teams rushed to the spot after receiving a call around 3:15-3.30 pm and launched rescue operations.
The collapse comes a month after a five-storey PG building in South Delhi’s Satya Niketan collapsed, killing seven people.
#Delhi #Seemapuri #DelhiBuildingCollapse #BuildingCollapse
— Madhuri Adnal (@madhuriadnal) October 7, 2026
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగిస్తున్నారు. వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ పోలీసులు స్థానికులకు ట్రాఫిక్ సలహా ఇచ్చారు. సీమాపురితోపాటు పరిసర గోల్ చక్కర్, డీఎల్ఎఫ్ భోపురా రోడ్లు కాకుండా కుదిరితే వేరే మార్గాల్లో వెళ్లాల్సిందిగా వాహనదారులకు సూచించారు. ఎందుకంటే ఇక్కడ సహాయక చర్యల కోసం అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే బాధితుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సి ఉంటుందని, ఇందుకోసం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాలన్నారు.
తప్పనిసరిగా ఈ మార్గాల్లో వచ్చే వారు ఇక్కడ ఆగడం కానీ, వాహనాలు పార్కింగ్ చేయడం కానీ చేయరాదని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.