న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన బీటెక్ పానీపూరి వాలి తన జర్నీ విశేషాలతో షేర్ చేసిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 21 ఏండ్ల తాప్సి ఉపాధ్యాయ్ బీటెక్ పానీపూరి వాలిగా పేరొందిన తీరును ఆర్ యూ హంగ్రీ అనే ఇన్స్టాగ్రాం పేజ్ నెటిజన్ల కండ్లకు కట్టింది. ఈ క్లిప్ ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 50 లక్షల వ్యూస్ రాబట్టింది.
మీరు అంకితభావం, కష్టపడే తత్వంతో ముందుకెళితే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు..ఇందుకు బీటెక్ పానీపూరి వాలీగా పేరొందిన 21 ఏండ్ల తాప్సి ఉపాధ్యాయ్ స్టోరీనే నిదర్శనమని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆర్ యూ హంగ్రీ ఇన్‌స్టా పేజ్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియోలో తాప్సి తన పానీపూరి స్టాల్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు తగిలించి బైక్‌పై దూసుకుపోవడం కనిపిస్తుంది.
ఢిల్లీలోని తిలక్ నగర్లో ఆమె స్టాల్ ఉండగా వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని తన సక్సెస్‌పై తాప్సి చెప్పుకొచ్చారు. ఈ క్లిప్‌లో ఆమె పానిపూరిలతో పాటు ఇంటి నుంచి స్పైసెస్తో చేసిన నీరు, కర్జుర్, బెల్లంతో తయారుచేసిన చట్నీని చూపారు. బీటెక్ పూర్తికాగానే తాప్సి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. తన స్టాల్లో ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ జోడించాలని తపసి కోరుకుంటోంది.
Read More :