బేతుల్ (ఎంపీ), ఏప్రిల్ 9: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక నిలిచిపోయింది. అక్కడ పోటీ చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భళావి మంగళవారం మృతి చెందడంతో ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఈ నెల 26న జరగాల్సిన ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నరేంద్ర సింగ్ రఘువంశీ తెలిపారు. ప్రైవేట్ దవాఖానను నిర్వహిస్తున్న అశోక్‌కు గుండెపోటు రావడంతో అతడిని వెంటనే దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.