పంజాబ్ | అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ను కూల్చివేత
Gurdaspur | పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్
గుర్దాస్పూర్: పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్ రావడాన్ని జవాన్లు గుర్తించారు. దానిపై కాలప్పులు జరపడంతో కూలిపోయింది. అనంతరం ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టామని బీఎస్ఎఫ్ డీఐజీ వెల్లడించారు. డ్రోన్ సాయంతో సరిహద్దుల్లో ఏవైనా వస్తువులను వదిలారా అనేకోణంలో గాలిస్తున్నామని చెప్పారు. ఆ డ్రోన్ పాక్ నుంచి ఏదో కన్సైన్మెంట్ను తీసుకొచ్చిందని అనుమానం వ్యక్తంచేశారు.

డ్రోన్‌పై జవాన్లు మొత్తం 17 రౌండ్ల కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో దాని బ్లేడ్ ఒకటి దెబ్బతిన్నదని వెల్లడించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకుంటున్నామని తెలిపారు. గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్ వైపు నుంచి మొత్తం 191 డ్రోన్లు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాయని చెప్పారు. ఇవి అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

