అమృత్‌సర్‌లో పాక్ డ్రోన్ కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు
Drone | పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.
అమృత్సర్: పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. రానియా ఔట్‌పోస్ట్ సమీపంలో ఆదివారం రాత్రి పాకిస్థాన్ వైపు నుంచి ఒక డ్రోన్ భారత్‌లోకి చొచ్చుకొచ్చింది. గుర్తించిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో అది కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఆ ఆక్టా కాపర్ సుమారు 12 కిలోల బరువు ఉన్నదని చెప్పారు. అది ఓ కన్సైన్మెంట్ తీసుకురావడాన్ని గుర్తించారు. అయితే అందులో ఏమున్నాయనే విషయాన్ని అధికారులు తెలియజేయలేదు.
కాగా, మూడు రోజుల క్రితం (అక్టోబర్ 14న) గురుదాస్‌పూర్ సెక్టార్లో భద్రతా దళాలు ఓ డ్రోన్‌కు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్ రావడాన్ని గుర్తించిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్ వైపు నుంచి మొత్తం 193 డ్రోన్లు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాయని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amritsar
- BSF
- consignment
- drone
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

