Pakistani drone | పాక్ డ్రోన్‌ను కూల్చిన బీఎస్ఎఫ్ బలగాలు.. నాలుగు రోజుల్లో ఐదో సారి
పంజాబ్‌లో (Punjab) మరోసారి పాకిస్థానీ డ్రోన్ (Pakistani drone) పట్టుబడింది. అమృత్సర్ (Amritsar) జిల్లాలోని భైనీ రాజ్‌పుతానా గ్రామం వద్ద ఓ డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దును (International Border) దాటడాన్ని బీఎస్ఎఫ్ (BSF) బలగాలు గుర్తించాయి.
అమృత్సర్: పంజాబ్‌లో (Punjab) మరోసారి పాకిస్థానీ డ్రోన్ (Pakistani drone) పట్టుబడింది. అమృత్సర్ (Amritsar) జిల్లాలోని భైనీ రాజ్‌పుతానా గ్రామం వద్ద ఓ డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దును (International Border) దాటడాన్ని బీఎస్ఎఫ్ (BSF) బలగాలు గుర్తించాయి. దీంతో దానిపై కాల్పులు జరిపిన సైనికులు నేలకూర్చారు. దానినుంచి ఓ కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2.1 కిలోల హెరాయిన్ (Heroin) ఉన్నట్లు గుర్తించారు. కాగా, గత నాలుగు రోజుల్లో అమృత్సర్ జిల్లాలోనే ఐదు డ్రోన్లు పట్టుబడటం విశేషం.
మే 19 తర్వాత పాకిస్థానీ డ్రోన్లను కూల్చడం ఇది ఐదో సారని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. గత శుక్రవారం పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చిన రెండు డ్రోన్లను నేలకూల్చామని చెప్పారు. ఇక శనివారం రాత్రి పట్టుబడిన డ్రోన్ నుంచి 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

