కర్ణాటక సీఎం యడ్యూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో వైద్యుల సలహా మేరకు తాను ఇవాళ ఆస్పత్రిలో చేరానని, ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. అయితే, స్వల్పంగా జ్వరం తప్ప తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
తనకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఇటీవల తనను కలిసిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. అయితే, ఉదయమే బెంగళూరులోని రామయ్య ఆస్పత్రిలో చేరిన ఆయనకు పాజిటివ్ రావడంతో మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. గత ఏడాది ఫస్ట్ వేవ్ సందర్భంగా కూడా ఆయనకు, ఆయన, కుమార్తె పద్మావతి ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

