పెళ్లిలో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని వీడియోలను చూస్తే నవ్వొస్తోంది. ఇంకొన్ని వీడియోలు ఏడిపిస్తాయి. కానీ.. ఈ వీడియో చూస్తే.. నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఎందుకంటే.. పెళ్లి జరుగుతుండగానే.. పెళ్లి మండపం మీద పెళ్లి కూతురును.. పెళ్లి కొడుకు చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి తంతు ముగిసిన తర్వాత పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురుకు స్వీటు తినిపించబోయాడు. కానీ.. పెళ్లి కూతురు మొహం చాటేసింది.. తినలేదు. దీంతో కోపం వచ్చి తన ముఖం మీదనే స్వీటును విసిరికొట్టాడు పెళ్లికొడుకు. నా ముఖం మీదనే స్వీటు విసిరికొడతావా అని కోపంతో పెళ్లికూతురు ప్లేట్లో ఉన్న మరో స్వీటును తీసుకొని అతడి మీద విసిరేసింది. దీంతో పెళ్లికొడుకుకు కోపం వచ్చి వధువుపై విరుచుకుపడ్డాడు. తనను చితకబాదాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు వీడియో చూసి.. ఇప్పుడే ఇలా భార్యను చితకబాదితే.. పెళ్లయ్యాక ఆ యువతి పరిస్థితి ఏంటో అంటూ కామెంట్లు చేశారు. ఇదేదో ఇద్దరికీ ఇష్టం లేని పెళ్లి ఉన్నట్టుంది. అందుకే వాళ్లు అలా ముఖం పెట్టారు. పెళ్లి తర్వాత వాళ్ల జీవితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే కళ్లకు కట్టినట్టు చూపించారు… అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.