ఈరోజుల్లో పెళ్లంటే ఏదో తాటాకు పందిళ్లు వేసి.. దాని కింద పీటల మీద కూర్చొని పురోహితుల మంత్రాల మధ్య సాగిపోవడం లేదు. పెళ్లంటే నూరేళ్ల పండుగ అన్నట్టుగా.. తమ జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్లిని చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తోంది నేటి యూత్. అందుకే.. పెళ్లికి ఓ 10 రోజుల ముందు నుంచే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌తో పాటు సంగీత్, హల్దీ లాంటి వేడుకలు, డ్యాన్సులు గట్రా అన్నీ సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. జీవితాంతం ఆ మెమోరీస్‌ను తమ గుండెల్లో భద్రపరుచుకుంటున్నారు.
తాజాగా ఓ యువతి కూడా అలాగే చేసింది. తన పెళ్లిరోజును సూపర్‌గా ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గూర్గావ్కు చెందిన సబా కపూర్ అనే యువతి తన పెళ్లి రోజును వెరైటీగా ప్లాన్ చేసింది. పెళ్లికూతురు ఎంట్రీ సమయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన బార్ బార్ దేఖో సినిమాలోని సా ఆస్మానోకో అనే పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టింది. అందరితో డ్యాన్స్ వేస్తూ చివరకు పెళ్లికొడుకు దగ్గరకు చేరుకొని అతడికి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన సరికొత్త ఎంట్రీకి పెళ్లికొడుకు ఫిదా అయిపోయాడు. నెటిజన్లు కూడా వావ్.. వాట్ ఏ డ్యాన్స్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.