రెండో ఎక్కం కూడా రానివాడితో పెళ్లా? పీటలపై నుంచి లేచివెళ్లిపోయిన వధువు
నమ్మడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం ! కనీసం రెండో ఎక్కం కూడా రానివాడిని పెళ్లి ఏం చేసుకోవాలని ఓ పెళ్లి కూతురు పీటలపై నుంచి లేచివెళ్లిపోయింది.
నమ్మడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం ! కనీసం రెండో ఎక్కం కూడా రానివాడిని పెళ్లి ఏం చేసుకోవాలని ఓ పెళ్లి కూతురు పీటలపై నుంచి లేచివెళ్లిపోయింది. దీంతో షాకవడం పెళ్లికొడుకు వంతైంది. ఇంతకీ పెళ్లిపీటల మీద కూర్చొని పంతులు చెప్పిన మంత్రాలు వింటూ.. ఆయన చెప్పింది చేయాల్సిన వధువరుల మధ్య రెండో ఎక్కం ప్రస్తావన ఎందుకు వచ్చింది? కేవలం రెండో ఎక్కం రాదనే కారణంతోనే వధువు పెళ్లి ఆపేసిందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం..
అది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న మహోబా జిల్లా ధావర్లోని ఓ పెళ్లి మండపం. కాసేపట్లో పెళ్లి జరగబోతుండటంతో సందడి మామూలుగా లేదు. పెళ్లి పెద్దల హడావుడి.. యువతీయువకుల ఆటపాటలు.. మేళతాళాలు.. దీంతో మొత్తం సందడి సందడిగా ఉంది. పెండ్లి కొడుకు మండపంలో కూర్చున్నాడు. పెండ్లి కుమార్తె కూడా వచ్చి వరుడు పక్కన కూర్చుంది. పంతులు మంత్రాలు అందుకున్నాడు. అయితే పంతులు పఠించే మంత్రాలను పట్టించుకోకుండా.. వధువుతో మాటలు కలపాలనుకున్నాడు వరుడు. ఈ మంత్రాలు, లెక్కలూ మనకు అస్సలు అర్థం కావు అంటూ వధువుతో అన్నాడు. దానికి వధువు బదులిస్తూ మంత్రాలు అర్థం కాకపోతే ఫర్లేదు కానీ చిన్న చిన్న లెక్కలు అయితే వచ్చు కదా అని అడిగింది. కానీ అతనేం మాట్లాడలేదు. దీంతో వధువుకు ఎక్కడో తేడా కొట్టింది. వరుడి భండారం తెలుసుకునేందుకు రెండో ఎక్కం చెప్పు అని అడిగింది. రెండో ఎక్కమా? నేనా? అన్నట్లు నవ్వి ఊర్కున్నాడు.
“మీరు రెండో ఎక్కం చెబితేనే ఈ పెండ్లి జరుగుతుంది. అని వధువు కరాఖండిగా చెప్పింది. గొంతులో ఏదో అడ్డుపడినవాడిలా.. “రెండో ఎక్కమేగా….రెండు ఒకట్ల రెండు…రెండు రెండ్లు…ఆరు… ఎనిమిది… అంటూ నీళ్లు నమిలాడు. అంతే అక్కడి నుంచి లేచి వధువు గబగబా వెళ్లిపోపయింది. అక్కడేం జరుగుతుందో తెలియక అందరూ షాకయ్యారు. ఆమె అలా మండపంలో నుంచి దిగిరాగానే అందరూ ఆమె చుట్టూ చేరి ఏమైందని అడిగారు. “మీరే చెప్పండి… రెండో ఎక్కం కూడా చెప్పలేని వాన్ని పెండ్లి చేసుకోమంటారా? సూటిగా ప్రశ్నించింది. దీంతో అందరూ తెల్లమొఖం వేశారు. అయినా సరే పెండ్లిపీటల మీద పెళ్లి ఆగిపోవద్దని వధువుకు నచ్చజెప్పడానికి పెద్దలు ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఇక చేసేది లేక వధువు ఇష్టప్రకారమే… పెండ్లి రద్దు చేసుకున్నారు.

నిజానికి ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం. వధువు విద్యావంతురాలు. వరుడు నిరక్షరాస్యుడు. అసలు స్కూల్‌కే పోలేదంట. కానీ ఈ విషయాన్ని అబ్బాయి తల్లిదండ్రులు దాచి పెళ్లి చేయాలని ప్రయత్నించారు. నిజాలు చెప్పకుండా అసలు విషయం దాచి మోసం చేయాలని ప్రయత్నించారనే కారణంతోనే వధువు పెండ్లి ఆపేసిందని ఆమె బంధువులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
23 ఏండ్లుగా ఆ దంపతులతో అడవి ఎలుగుబంటి స్నేహం
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పార్టీలు ఇవే.. ఆ ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే..
Corona virus FAQs: కరోనా వచ్చిన వారందరూ ఆస్పత్రిలో చేరాలా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

