23 ఏండ్లుగా ఆ దంపతులతో అడవి ఎలుగుబంటి స్నేహం
అడవి ఎలుగుబంటి | అడవి ఎలుగుబంటిని చూశామంటే మన గుండెలు హడలిపోతాయి. అలాంటిది ఓ దంపతులిద్దరూ అడవి ఎలుగుబంటితో స్నేహం చేశారు. ఇది వినడానికి

అడవి ఎలుగుబంటిని చూశామంటే మన గుండెలు హడలిపోతాయి. అలాంటిది ఓ దంపతులిద్దరూ అడవి ఎలుగుబంటితో స్నేహం చేశారు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేనప్పటికీ వందకు వంద శాతం నిజం. రష్యాకు చెందిన దంపతులిద్దరూ ఎలుగుబంటితో స్నేహం చేశారు. తమ కుటుంబంలో ఒకరిగా ఆ జంతువును కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
రష్యాకు చెందిన స్వెట్లనా, యూరి పంటేల్నీకో అనే దంపతులు స్టెపన్ అనే మూడు నెలల అడవి ఎలుగుబంటిని 23 ఏండ్ల క్రితం దత్తత తీసుకున్నారు. వేటగాళ్ల చేతిలో తీవ్రంగా గాయపడిన ఈ ఎలుగుబంటిని అటవీ సిబ్బంది రక్షించారు. ఆ జంతువును స్వెట్లనా దంపతులు దత్తతగా తీసుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు.

తల్లి లేని బాధ తెలియదు
ఆ ఎలుగుబంటికి తల్లి లేని బాధను తెలియకుండా పెంచారు ఆ దంపతులు. ప్రస్తుతం దాని బరువు 300 ఎల్బీ, ఏడు అడుగుల ఎత్తు. ఇక మనషులతో అది సరదాగా ఉంటుంది. ఆనందం వచ్చినప్పుడల్లా ఆ దంపతుల హృదయాలను హత్తుకుంటుంది. ఇతరులకు ఎలాంటి హానీ కలిగించదు. ఇప్పటి వరకు ఎవరినీ కరవలేదు. అందుకే ఆ ఎలుగుబంటిని చుట్టుపక్కల వారు కూడా అమితంగా ప్రేమిస్తారు.

గార్డెన్ పనుల్లో సహాయం.. టీవీ చూడడమంటే మహా ఇష్టం
ఇంటి పనులతో పాటు గార్డెన్ పనుల్లోనూ ఆ ఎలుగుబంటి సహాయం చేస్తోంది. మొక్కలకు నీళ్లు పడుతోంది. అంతే కాదు దానికి టీవీ చూడడమంటే మహా ఇష్టం. రష్యన్ దంపతులతో కలిసి టీవీ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. ఇక పుస్తక పఠనం చేసే సమయంలోనూ అది కూడా దగ్గరగా ఉంటుంది.

ప్రతి రోజు 25 కేజీల ఆహారం
ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఎలుగుబంటికి ఆహారాన్ని కొదవ కానియ్యరు. ప్రతి రోజు 25 కేజీల ఆహారం తీసుకుంటోంది ఆ జంతువు. చేపలు, గుడ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటోంది. పాలను ఇష్టంగా తాగుతుంది. ఇక ఫుట్ బాల్ అద్భుతంగా ఆడుతోంది. పలు సినిమాల్లో నటించిన ఆ ఎలుగుబంటి పలు ఫోటోషూట్లలో పాల్గొన్నది.

Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Russia
- Trending news
- Wild Bear
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

