ప్రపంచంలో అత్యంత ఖరీదైన పార్టీలు ఇవే.. ఆ ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పార్టీలు | చేతి నిండా డబ్బు ఉంటే.. చక్కగా, హుందాగా, చూడముచ్చటైన పార్టీలు చేసుకోవచ్చు. కానీ అలా పార్టీలు చేసుకోవడం
చేతి నిండా డబ్బు ఉంటే.. చక్కగా, హుందాగా, చూడముచ్చటైన పార్టీలు చేసుకోవచ్చు. కానీ అలా పార్టీలు చేసుకోవడం ప్రపంచ కుబేరులకే సాధ్యమవుతోంది. అలా కొంత మంది బిలినీయర్లు.. తమ పార్టీలకు మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి.. జీవితాంతం గుర్తుండిపోయేలా పార్టీలను నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టి పార్టీలు నిర్వహించిన వారిగా వారు చరిత్రలో నిలిచిపోయారు.
దుబాయిలో అట్లాంటిస్ హోటల్ ప్రారంభం.. ఖర్చు 31 బిలియన్ డాలర్లు

దుబాయికి చెందిన అట్లాంటిస్ హోటల్ ఖరీదైన పార్టీల నిర్వహణకు ఫేమస్. traveller.com ప్రకారం ఈ హోటల్ ప్రారంభోత్సవానికి 31 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి అమెరికా యాక్టర్ రాబర్డ్ డి నీరో, అమెరికా అందగత్తెలు చార్లైజ్ థెరాన్, లిండ్శాయ్ లోహన్, ఆస్ర్టేలియా సింగర్ క్యాలీ మినోగ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
బ్రూనై రాజు హస్సనల్ బొల్కియా 50వ జన్మదినం

బ్రూనై సుల్తాన్ హస్సేనల్ బొల్కియా తన 50వ జన్మదినాన్ని అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రపంచంలో ఎవరూ జరుపుకోలేని రీతిలో నిర్వహించి వార్తల్లో నిలిచారు. లగ్జరీ సౌకర్యాలతో పార్టీ నిర్వహించిన ఆయన.. తొలిసారిగా సివిల్ సర్వెంట్స్ కు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలా 27.2 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు బ్రూనై సుల్తాన్.
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ వివాహం

అబుదాబి క్రౌన్ ప్రిన్స్ వివాహం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ప్రిన్స్ షేక్ మహ్మద్ బిన్ జాయిద్, ప్రిన్సెస్ సలామా వివాహం కోసం 20 వేల మంది అతిథులు కూర్చొనేందుకు వీలుగా ప్రత్యేక స్టేడియాన్ని నిర్మించారు. ఏడు రోజుల పాటు కొనసాగిన ఈ వివాహ వేడుకకు 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు.
ఫిలిప్ గ్రీన్ 60వ బర్త్‌డే

అర్కాడికా గ్రూప్ సీఈవో ఫిలిప్ గ్రీన్ బర్త్ డే వేడుకలకు కూడా భారీగా ఖర్చు పెట్టారు. 20 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి అతిథులకు గుర్తుండి పోయేలా పార్టీ ఇచ్చారు. ఈ బర్త్‌డే పార్టీకి అమెరికా యాక్టర్స్ లియోనార్డో డికార్పియో, కాటే హడ్సన్, బ్రిటిష్ మోడల్ నవోమీ క్యాంప్‌బెల్ లాంటి వాళ్లు హాజరయ్యారు.
డేవిడ్ బ్రూక్ కుమార్తె ఎలిజబెత్ బర్త్ డే

డేవిడ్ బ్రూక్ తన 13 ఏండ్ల కూతూరు ఎలిజబెత్ జన్మదినానికి 10 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. ఇక ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులైన వారందరినీ పిలిచారు. ఏరోస్మిత్, సియారా, 50 సెంట్, స్టీవే నిక్స్, టామ్ పెటీ హాజరయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

