న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసును అణచివేసేందుకు సీఎం భగవంత్ మాన్ భార్య రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదుపై పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీచేసింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపి రెండు వారాల్లోగా తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని అధికారులను కమిషన్ ఆదేశించింది.
ఒక లైంగిక దాడి కేసు విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భార్య రూ.5 కోట్ల డిమాండ్ చేసినట్లు ఒక రిటైర్డ్ న్యాయమూర్తి బహిరంగంగా పేర్కొన్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఆగస్టు 21 నాటి ఉత్తర్వులో ఈ విషయాన్ని కమిషన్ పేర్కొన్నదని అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.