Wrong Surgery | బాలుడి కాలుకు సర్జరీ బదులు.. సున్తీ చేసిన వైద్యులు
Wrong Surgery | గాయపడిన బాలుడి కాలుకు సర్జరీ బదులు డాక్టర్లు సున్తీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పొరపాటు జరిగింది. ఇది తెలిసి షాకైన బాలుడి తల్లిదండ్రులు వైద్యాధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ల తప్పు, నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై: గాయపడిన బాలుడి కాలుకు సర్జరీ బదులు డాక్టర్లు సున్తీ చేశారు. (Wrong Surgery) ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పొరపాటు జరిగింది. ఇది తెలిసి షాకైన బాలుడి తల్లిదండ్రులు వైద్యాధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ల తప్పు, నిర్లక్ష్యంపై దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షాహాపూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కాలుకు గాయమైంది. దీంతో బాలుడి తల్లిదండ్రులు జూన్ 15న షాహాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలుడి కాలుకు సర్జరీ బదులు సున్తీ చేశారు. జరిగిన పొరపాటు తెలుసుకున్న డాక్టర్లు గాయమైన కాలుకు కూడా శాస్త్రచికిత్స చేశారు. ఇది తెలిసి బాలుడి పేరెంట్స్ షాక్ అయ్యారు. వైద్యాధికారులతోపాటు షాహాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు అదే వయస్సున్న ఇద్దరు బాలురకు సర్జరీ చేయాల్సి ఉండటంతో తమ కుమారుడికి పొరపాటున సున్తీ చేసి ఉంటారని ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ప్రయత్నించారు. బాలుడి ప్రైవేట్ భాగంలో కూడా సమస్య ఉందని వైద్యాధికారి గజేంద్ర పవార్ తెలిపారు. దీంతో ఆ బాలుడికి రెండు ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందన్నారు. అయితే డాక్టర్లు ఒక సర్జరీ గురించి మాత్రమే బాలుడి పేరెంట్స్‌కు చెప్పి ఉంటారని, రెండో ఆపరేషన్ గురించి చెప్పడం మరిచి ఉంటారని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

