బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై బుధవారం దాడి జరిగింది. కూచ్ బెహార్‌లోని సిటల్కుచి ప్రాంతంలో ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. సమీపంలో సీఎం మమత నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తున్నది.
ఈ సందర్భంగా టీఎంసీ గూండాలు తనతోపాటు బీజేపీ కార్యకర్తలపై నాటు బాంబులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారని దిలీప్ ఘోష్ ఆరోపించారు. ఈ ఘటనలో తన కారు అద్దాలు ధ్వంసం కావడంతోపాటు తనకు దెబ్బలు తగిలినట్లు ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం దయనీయంగా ఉన్నదని, పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు.
మరోవైపు బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. ఈ దాడిలో తమ కార్యకర్తల ప్రమేయం లేదని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

