బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం.. 22 వేల చెట్లను నరికేందుకు బాంబే హైకోర్టు అనుమతి
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై ముంబై పర్యావరణ పరిరక్షణకు చెందిన ఎన్జీవో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ముంబై: మహారాష్ట్రలో చేపట్టనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 22 వేల చెట్లను నరికేందుకు బాంబే హైకోర్టు అనుమతించింది. అయితే షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం ముంబైతోపాటు పొరుగున ఉన్న పాల్ఘడ్, థానే జిల్లాల పరిధిలో విస్తరించిన 50,000కు పైగా మడ చెట్లను నరికివేయడంపై నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కోరిన అనుమతిని 2018లో కో-ఆర్డినేట్ బెంబ్ తిరస్కరింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ అయితే బాంబే హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
ఈ నేపథ్యంలో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. గతంలో పేర్కొన్న 50 వేలకుపైగా చెట్ల నరికివేతను 22 వేలకు తగ్గించినట్లు తెలిపింది. అలాగే నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్ల మేర మొక్కలు నాటుతామని హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు పొందినట్లు కోర్టుకు వివరించింది.
కాగా, బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై ముంబై పర్యావరణ పరిరక్షణకు చెందిన ఎన్జీవో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. చెట్లు నరకడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయలేదని పేర్కొంది. అలాగే ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుడు కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది.
మరోవైపు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విన్నది. డిసెంబర్ 1న రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం సుమారు 22,000 మడ చెట్ల నరికివేతకు అనుమతించింది. అయితే పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ మంజూరు చేసిన అనుమతులలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు కట్టుబడాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

