ISRO | ఇస్రోకు బాంబు బెదిరింపు మెయిల్.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కు బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. బెంగళూరు (Bengalore) లోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు ఇస్రో సిబ్బంది తెలిపారు. దాంతో అప్రమత్తమైన ఇస్రో (ISRO) సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కు బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. బెంగళూరు (Bengalore) లోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు ఇస్రో సిబ్బంది తెలిపారు. దాంతో అప్రమత్తమైన ఇస్రో (ISRO) సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాంబు స్క్వాడ్‌తో హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న పోలీసులు ఇస్రో ప్రాంగణంలో సిబ్బందిని ఖాళీ చేయించి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇది నకిలీ బాంబు బెదిరింపు అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ-మెయిల్ ఎవరు పంపారు..? ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుండగా ఢిల్లీ పోలీసులు నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన అతడు.. ఎన్ఐఏ, డీఆర్డీఓ, కేంద్ర పౌర విమానయాన శాఖ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.
సాంకేతికత సాయంతో నిందితుడిని గుర్తించి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నివాసంలో ఎలాంటి పేలుడు పదార్థాలుగానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

