Boman Irani : ప్రపంచవ్యాప్తంగా పార్సీలు తమ న్యూ ఇయర్‌ను మార్చి 20న సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తన ఇంట్లో జరిగిన నవరోజ్ వేడుకల వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. నవరోజ్ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బొమన్ ఇరానీ ప్రార్ధనలు చేశారు.
ఆపై నోరూరించే పసందైన వంటకాలను వీడియోలో చూపించారు. వీడియోలో తొలుత ఇరానీ అద్దంలో కనిపిస్తుండగా ఆపై పండగకు చేసిన రెసిపీలను క్లిప్‌లో డిస్ప్లే చేశారు. రైస్, స్వీట్స్ బాక్స్ సహా పిస్తాలు, వాల్నట్స్, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ బౌల్స్ కనిపించారు. ఇక క్యాంటీస్, డేట్స్, చాక్లెట్స్, వేఫర్స్ కూడా కనువిందు చేస్తాయి.
ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ బాస్కెట్ నిండా తాజా పండ్లను వీడియోలో చూడొచ్చు. అరటిపండ్లు, యాపిల్స్, టొమాటోలు, పపాయా, గ్రేప్స్, ఆరెంజెస్‌తో సహా పలు రకాల పండ్లు ఈ క్లిప్‌లో కనిపించాయి. బొమన్ ఇరానీ నవరోజ్ శుభాకాంక్షలు తెలపడంతో ఈ వీడియో ముగుస్తుంది. నవరోజ్ ముబారక్..ఈ పండుగ మీ ఇంట ప్రేమ, సంతోషం, సౌభాగ్యాలను కురిపించాలని ఈ వీడియోను షేర్ చేస్తూ ఆయన రాసుకొచ్చారు.
Read More :