సోమవారం 13 జూలై 2020
National - Jun 19, 2020 , 14:43:53

కారులో క‌రోనా సోకిన వ్య‌క్తి శ‌వం

కారులో క‌రోనా సోకిన వ్య‌క్తి శ‌వం

ఢిల్లీ మోతీన‌గ‌ర్ ప్రాంతంలో కారులో శ‌వం ఉండ‌టం క‌ల‌క‌లం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘ‌టాస్థ‌లానిక చేరుకుని కారులో నుండి శ‌వాన్ని బ‌య‌ట‌కు తీశారు. కాగా కారులో దొరికిన కాగితాల ఆధారంగా చ‌నిపోయిన అత‌నికి కొవిడ్ పాజిటివ్ అని తేల‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై కావాల్సిన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నారు. 

వివ‌రాల్లోకెళితే.. చ‌నిపోయిన వ్య‌క్తిని దీప‌క్‌(38)గా గుర్తించారు. మోతీన‌గ‌ర్‌లో నివాస‌ముండే దీప‌క్ జులేలాల్ మందిర్ ప్రాంతంలో మెకానిక్ షాప్ న‌డిపేవాడ‌ని, రెండు రోజుల క్రితం దీపక్ కి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని పోలీసులు తెలిపారు. కాగా కారులో ఏసీ ఆన్ చేసి ఉండ‌టం చూస్తుంటే దీప‌క్ హార్ట్ అటాక్ ద్వారా చ‌నిపోయి ఉండ‌వ‌చ్చ‌ని ప్రాధ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.


logo