కదులుతున్న ఆటోలో పేలుడు.. ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ
Mangaluru | కర్ణాటకలోని మంగళూరులో కదులుతున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో కదులుతున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌సహా మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఇది ప్రమాదం కాదని తేల్చారు. ఇందులో ఉగ్రకోణం ఉందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
అయితే ప్యాసింజర్ వద్ద బ్యాగ్‌లో మంటలు అంటుకున్నాయని ఆటో డ్రైవర్ వెల్లడించారు. క్రమంగా అవి వాహనం మొత్తం వ్యాపించాయని తెలిపారు. కాగా, బస్టాప్ సమీపంలో ఓ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆటోలో పేలుడు జరిగింది.
It’s confirmed now. The blast is not accidental but an ACT OF TERROR with intention to cause serious damage. Karnataka State Police is probing deep into it along with central agencies. https://t.co/lmalCyq5F3
— DGP KARNATAKA (@DgpKarnataka) November 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

