బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని జయనగర్ నియోజకవర్గం ఫలితం రాత్రి వరకు తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థిని సౌమ్యా రెడ్డి తొలి నుంచి బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తిపై ఆధిక్యంలో నిలిచారు. అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తైన తర్వాత రామమూర్తిపై సౌమ్యా రెడ్డి 294 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆమె గెలిచినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అయితే రీకౌంటింగ్ జరుపాలని బీజేపీ అభ్యర్థి డిమాండ్ చేశారు. దీనికి ఎన్నికల సంఘం (ఈసీ) అంగీకరించింది. ఈ నేపథ్యంలో పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డిపై బీజేపీ అభ్యర్థి రామమూర్తి కేవలం 16 ఓట్లతో గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. సౌమ్యా రెడ్డికి 57,781 ఓట్లు రాగా, రామమూర్తికి 57,797 ఓట్లు వచ్చినట్లు పేర్కొంది.
కాగా, శనివారం రాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ హైడ్రామాపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థికి ఈసీ సహకరించిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. తమ అభ్యర్థి ఫలితాన్ని ఈసీ అధికారులు తారుమారు చేశారని విమర్శించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో పోలీసులను భారీ స్థాయిలో మోహరించారు.
ಜಯನಗರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ಶ್ರೀಮತಿ ಸೌಮ್ಯ ರೆಡ್ಡಿ ಅವರು ಗೆಲುವು ಸಾಧಿಸಿದ್ದರೂ ಮರುಎಣಿಕೆ ನೆಪದಲ್ಲಿ ಫಲಿತಾಂಶ ತಿರುಚಲು ಪ್ರಯತ್ನಿಸಿದ ಚುನಾವಣೆ ಅಧಿಕಾರಿಗಳ ನಡೆ ವಿರೋಧಿಸಿ ಮತ ಎಣಿಕೆ ಕೇಂದ್ರ ಜಯನಗರದ ಆರ್ ವಿ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆ ಎದುರು ಧರಣಿ ನಡೆಸಿ, ಮತ ಎಣಿಕೆ ಕೇಂದ್ರದ ಒಳಗೆ ಏಜೆಂಟರಲ್ಲದ ಬಿಜೆಪಿ ಮುಖಂಡರಾದ ಆರ್… pic.twitter.com/9F9LGFwO05
— DK Shivakumar (@DKShivakumar) May 13, 2023