బెల్గాంలో బీజేపీ గెలుపు.. కన్యాకుమారిలో ఎదురుగాలి

తిరుపతిలో వైసీపీ విజయం.. 13 రాష్ర్టాల్లో ఉప ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ, మే 2: పదమూడు రాష్ర్టాల్లో 4 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారం చేపట్టారు. కడపటి సమాచారం అందేసరికి కొన్ని స్థానాల ఫలితాలు వెల్లడి కాగా మిగతావాటివి తెలియాల్సి ఉన్నది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో ఒక్కొక్కటి చొప్పున 4 లోక్‌సభ స్థానాలు, 10 రాష్ర్టాల్లోని 12 అసెంబ్లీ స్థానాలకు గత నెల 6, 17 తేదీల్లో ఉప ఎన్నిక నిర్వహించారు.
- కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గంతో పాటు బసవకల్యాణ్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మరో అసెంబ్లీ సీటు ‘మస్కీ’లో కాంగ్రెస్ విజయం సాధించింది. బెల్గాంలో బీజేపీ అభ్యర్థి, రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి, దివంగత సురేశ్ అంగడి భార్య మంగళ సురేశ్ అంగడి కాంగ్రెస్ అభ్యర్థి సతీశ్ జార్ఖిహోళిపై 5,240 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
- తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానంలో బీజేపీకి ఎదురుగాలి వీచింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ వసంత్ లక్షా 11 వేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
- కేరళలోని మళప్పురం లోక్‌సభ స్థానంలో ఇండియన్ ముస్లిం లీగ్ నాయకుడు అబ్దుస్సమాద్ సమదాని విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థిపై ఆయన 1,14,615 ఓట్ల ఆధిక్యత సాధించారు.
- రాజస్థాన్‌లో కాంగ్రెస్ రెండు, బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాయి.
- మహారాష్ట్రలోని పంధర్పూర్ అసెంబ్లీ స్థానంలో రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ విజయం సాధించింది. ఈ సీటు అధికార పక్షంలో భాగస్వామి అయిన ఎన్సీపీ ఖాతాలో ఉండేది.
- తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి జయకేతనం ఎగురవేశారు. 2,70,584 ఓట్ల మెజార్టీ సాధించారు. గురుమూర్తికి 6,23,774 ఓట్లు రాగా.. టీడీపీకి 3,53,190, బీజేపీకి 56,820, కాంగ్రెస్‌కు 9,549 ఓట్లు వచ్చాయి. 2019లో అధికార వైకాపా అభ్యర్థి 2.28 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

