Akhilesh Yadav: ఘజియాబాద్ నుంచి ఘాజిపూర్ వరకు బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేశ్ యాదవ్
Akhilesh Yadav: ఘజియాబాద్ నుంచి ఘాజిపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్ధానాలు అసత్యం అని తేలినట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
లక్నో: ఘజియాబాద్ నుంచి ఘాజిపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) అన్నారు. మరో రెండు రోజుల్లో లోక్‌సభ తొలి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఆ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ చేసిన ప్రతి ప్రామిస్ ఉత్తదే అని తేలిందన్నారు. అయితే పశ్చిమం నుంచి వీస్తున్న గాలి.. తొలి దశ ఎన్నికల్లో దేశాన్ని మార్చనున్నట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఇవాళ మేం ఘజియాబాద్‌లో ఉన్నామని, ఇక ఈసారి ఇండియా కూటమి ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు తుడిచి వేస్తుందని, రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్ధానాలు అసత్యం అని తేలినట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. యూపీలో పశ్చిమ దిశలో ఉన్న ఘజియాబాద్‌లో ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక తూర్పులో ఉన్న ఘాజిపూర్లో జూన్ ఒకటో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వెనుకబడిన వారు, దళితులు, అల్పసంఖ్యాకులు.. అందరూ కలిసి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడిస్తారని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

