Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైనా జైలు తప్పదు : బీజేపీ
Arvind Kejriwal : మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది.
Arvind Kejriwal : మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్ (interim bail) మంజూరు చేసింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేయడంపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. కేజ్రీవాల్ కొత్త దోస్త్ లాలూ యాదవ్‌కు కూడా మధ్యంతర బెయిల్ లభించిందని, అయితే స్కామ్‌లో ఆయన దోషిగా తేలడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
ఆప్, అరవింద్ కేజ్రీవాల్‌పై లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడైన అరవింద్ కేజ్రీవాల్ ఈ స్కామ్‌లో అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ల పేర్లు కూడా వెల్లడించినందున వారు కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. కాగా, సుప్రీం బెయిల్ మంజూరు చేసినప్పటికీ కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇదే కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
తిహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను జూన్ 21న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు మూడురోజుల కస్టడీకి ఇచ్చింది. మళ్లీ జూన్ 29న ఆయనను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత ఈ నెల 12 వరకూ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైలులో సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Read More :
Kalki 2898 AD OTT | ‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు చేశారా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

