కోల్కతా : రాష్ట్రంలో త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించనున్న క్రమంలో ముందస్తు కుట్రలో భాగంగా అధికార బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓటర్ల జాబితాలోని వేలాది మంది అర్హుల పేర్లను కొట్టివేస్తూ పశ్చిమ బెంగాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని అధికార టీఎంసీ ఆరోపించింది.
పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ ఈసీ ఇటీవల తన వెబ్సైట్లో ఉంచిన ఓటర్ల జాబితాను, 2002 నాటి ఓటర్ల జాబితాతో పోలిస్తే పలు అక్రమాలు జరిగినట్టు గుర్తించామని తెలిపారు.