పారని బీజేపీ పాచిక

- సర్వశక్తులూ ఒడ్డినా అందని అధికారం
- సీఎం అభ్యర్థి లేక దెబ్బతిన్న కాషాయపార్టీ
- ఫిరాయింపులతో స్వపక్షంలో అసమ్మతి
- కరోనా వ్యాప్తితో పార్టీపై వ్యతిరేకత
పశ్చిమబెంగాల్లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. దాదాపు రెండేండ్ల కిందటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమైంది. కైలాస్ విజయవర్గీయ, శివప్రకాశ్, అరవింద్ మీనన్ వంటి సీనియర్ నాయకులను రాష్ర్టానికి పంపింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా బెంగాల్‌పై ప్రత్యేక దృష్టిసారించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సహా జాతీయనేతాగణమంతా విస్తృతంగా పాల్గొన్నారు. ప్రధాని దాదాపు 20 సభల్లో పాల్గొనగా, అమిత్‌షా 50 సభలకు హాజరయ్యారు. రాజ్‌నాథ్, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రదాన్, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలు కూడా విస్తృతంగా పర్యటించారు. మరోవైపు సువేంధు అధికారి సహా తృణమూల్‌లోని ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలం గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ పార్టీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. దీనికి కారణాలు..
- మమతను దీటుగా ఎదుర్కొనే సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి నష్టం చేకూర్చిందని పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. మోదీ చరిష్మాపైనే ఆధారప డటం కూడా చేటుచేసింది.
- ఇతర పార్టీల నుంచి భారీగా వలసలను ప్రోత్సహించడం దెబ్బతీసిందని, పార్టీలో ముందునుంచీ ఉన్నవారిలో ఇది అసమ్మతి రగలించిందని పార్టీ నేతలు చెప్తున్నారు.
- మమత కాలిగాయంపైనా తీవ్ర విమర్శలు చేయడం వ్యతిరేక ప్రభావం చూపింది.
- ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా.. ఒక్కో విడుతపై ప్రత్యేక దృష్టిసారి ంచాలన్న వ్యూహం కూడా బెడిసికొట్టిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నారు. పోలింగ్ తొలి దశల్లో బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు రాగా, కరోనా సెకండ్‌వేవ్ తీవ్రంగా ఉన్న చివరి దశల్లో ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- కరోనా రెండో వేవ్‌ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఓటింగ్‌పై ప్రభావం చూపింది.
- చివరి మూడు విడుతల్లో ప్రధాని మోదీ తదితర కీలక నేతలు ప్రచారాన్ని రద్దు చేసుకోవడం లేదా వర్చువల్ మాధ్యమంలో నిర్వహించడం ప్రభావం చూపింది. ఇదే సమయంలో మమత విస్తృత ప్రచారం నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

