Doda Terror Attack | ఉగ్రదాడులకు పాల్పడేవారికి దీటుగా బదులిస్తాం : అనురాగ్ ఠాకూర్
Doda Terror Attack : జమ్ము కశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మరణించిన ఘటనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
Doda Terror Attack : జమ్ము కశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మరణించిన ఘటనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఉగ్ర దాడులకు పాల్పడే వారిపై గతంలో కఠిన చర్యలు చేపట్టడం జరిగిందని, ఇప్పుడు కూడా ఉగ్ర మూకను అలాగే అణిచివేస్తామని అన్నారు. జమ్ము కశ్మీర్లో కొందరు శాంతిని భగ్నం చేయాలనుకుంటున్నారని చెప్పారు.
కానీ అలాంటి ఘటనలకు మన భద్రతా దళాలు దీటుగా బదులిస్తాయని ఆయన హెచ్చరించారు. కాగా, దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు తెలిపారు.రాత్రి 9 గంటల సమయంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని, భారీ కాల్పులు జరిగాయని ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 20 నిమిషాలకుపైగా కాల్పులు జరిగాయని పేర్కొంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన కశ్మీర్ టైగర్ ప్రకటించింది.
Read More :
Cyber Fraud | బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి రూ. 16.71 కోట్లు కొట్టేశారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

