ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్(Udaipur )లో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవార్ను.. సిటీ ప్యాలెస్‌లోకి రానివ్వలేదు. దీంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. సోమవారం రాత్రి సిటీ ప్యాలెస్ ముందు భారీ విధ్వంసం జరిగింది. రాజసమంద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన విశ్వరాజ్ సింగ్.. సోమవారం సిటీ ప్యాలెస్‌లో ఉన్న ఆలయాలను విజిట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఆయన సోదరుడు డాక్టర్ లక్ష్య రాజ్ సింగ్ అనుచరులు అడ్డుకున్నారు.
ఆ ప్యాలెస్‌లో ఉన్న ఆలయాలు ప్రస్తుతం ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఎమ్మెల్యే విశ్వరాజ్ మేవార్‌కు ఎంట్రీ దక్కకపోవడంతో.. ఆయన అభిమానులు, మద్దుతుదారులు సోమవారం రాత్రి ప్యాలెస్‌పై రాళ్లతో అటాక్ చేశారు. ఎమ్మెల్యే విశ్వరాజ్ కూడా తన మద్దతుదారులతో కలిసి ప్యాలెస్ ముందు గత రాత్రి 5 గంటల పాటు నిలుచున్నారు. ప్యాలెస్ వద్ద రెండు వైపుల నుంచి రాళ్ల దాడి జరిగింది. ప్యాలెస్ ఆవరణ లోపల ఉన్న వ్యక్తులు కూడా రాళ్లతో దాడి చేశారు.
అయితే సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే విశ్వరాజ్ భార్య మహిమా కుమారి సిట్టింగ్ ఎంపీ. మేవార్ కుటుంబంలో.. ప్రాపర్టీలు, ఆలయాలపై వివాదాలు ఉన్నాయి. విశ్వరాజ్ సింగ్‌కు ఇటీవల పట్టాభిషేకం జరిగినా.. సిటీ ప్యాలెస్‌లోకి ఆయన ఎంట్రీని మేవార్ కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నారు. మేవార్ కుటుంబానికి చెందిన 8వ శతాబ్ధాపు రాజు రాణా ప్రతాప్ చాలా ఫేమస్. మొఘల్స్‌తో హల్దీఘాటీలో జరిగిన సంగ్రామంలో రాణా ప్రతాప్ పాల్గొన్నారు.
పట్టాభిషేకం జరిగిన సందర్భంగా.. సంప్రదాయం ప్రకారం ప్యాలెస్‌లో ఉన్న ఆలయ దేవతల దీవెనలు తీసుకునేందుకు విశ్వరాజ్ ప్రయత్నించారు. సిటీ ప్యాలెస్లోపల దూనీమాతా, ఏకలింగ శివాలయం ఉన్నాయి. ఉదయ్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అవి ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆ ఆలయాల్లోకి విశ్వరాజ్కు ఎంట్రీ ఇచ్చేది లేదని మేవార్ కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో ఫ్యామిలీ రగడ మొదలైంది.