BJP | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. 60 నుంచి 70 స్థానాల్లో పోటీచేయనున్న బీజేపీ!
సుమారు పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ (BJP) సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.
న్యూఢిల్లీ: సుమారు పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ (BJP) సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. 370 అధికరణ రద్దుతో తమకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని భావిస్తున్న బీజేపీ.. కేంద్రపాలిత ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా 60 నుంచి 70 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నది. అదీ ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఆదివారం జరిగిన ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తున్నది. తాము పోటీలో లేని చోట బలమైన స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, తెలుగు వ్యక్తులైన రామ్ మాధవ్, కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
కాగా, చివరిసారిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 25, పీడీపీకి 28 సీట్లు వచ్చాయి. దీంతో పీడీపీ చీఫ్ మొహమ్మద్ ముఫ్తీ సయీద్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2016, జనవరిలో సయీద్ మరణంతో ఆయన కుమార్తే మెహబూబా ముఫ్తీ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేక పోయింది. 2018 జూన్‌లో ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేసి.. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

