Varun Gandhi | ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ (Pilibhit) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) పేరు ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిచిలిన విషయం తెలిసిందే. ఆయనకు ఈ సారి బీజేపీ టికెట్ ఇవ్వకపోవడమే అందుకు కారణం. అయితే, ఆయన తల్లి మేనకా గాంధీ (Maneka Gandhi)కి మాత్రం బీజేపీ మరోసారి అవకాశం కల్పించింది. దీంతో వరుణ్ గాంధీ పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది.
ఈ ప్రచారానికి తెరదించుతూ.. వరుణ్ బీజేపీ అభ్యర్థి అయిన తన తల్లి మేనకా గాంధీ తరఫున ప్రచారం మొదలు పెట్టారు. మేనకా గాంధీ (Maneka Gandhi) యూపీలోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి (Sultanpur constituency) బీజేపీ టికెట్‌పై లోక్‌సభ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తల్లికి మద్దతుగా వరుణ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు. ఆయన వరుసగా రెండుసార్లు బీజేపీ నుంచే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ సారి మాత్రం ఆయన్ని కమలం పార్టీ పక్కకు పెట్టేసింది.
#WATCH | Uttar Pradesh | BJP leader Varun Gandhi campaigns for his mother and party candidate from Sultanpur constituency Maneka Gandhi
“There is only one constituency in the country where its people do not call its MP as ‘Sansad’ but as ‘Maa’…I am here not just to gather… pic.twitter.com/8n7u9k8Ztp
— ANI (@ANI) May 23, 2024
Also Read..
Arvind Kejriwal | స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు
Anushka Sharma | ఆర్సీబీ ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న అనుష్క శర్మ.. VIDEO
Nikki Haley | అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ట్రంప్‌కే.. స్పష్టం చేసిన నిక్కీ హేలీ