ముంబై, మే 15: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించాడు ఓ ఎన్సీపీ కార్యకర్త.
అంబేకర్ తన ఆఫీసులో ఉన్న సమయంలో ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. పవార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. అంబేకర్ నిరాకరించడంతో ఓ కార్యకర్త ఆయనను లాగిపెట్టి కొట్టారు. మరాఠీ నటి కేతకి, మరో విద్యార్థి నిఖిల్ భామ్రేలు పవార్‌పై అభ్యంతరకరమైన పోస్టులను షేర్ చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.