లక్నో: బీజేపీకి చెందిన నేత ఒక యువకుడ్ని దారుణంగా కొట్టాడు. వరుసగా పంచ్‌లు ఇచ్చాడు. కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. చివరకు వారిద్దరూ పోలీస్ స్టేషన్లో రాజీపడ్డారు. అయితే వారు కొట్టుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (BJP Leader Kicks, Punches Youth) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. కారులో ఉన్న బీజేపీ నేత సచిన్ శర్మ ఒక వ్యక్తితో కొంతసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన కారు నుంచి కిందకు దిగాడు. అక్కడకు బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తిపై దాడి చేశాడు. అతడ్ని కొట్టడంతోపాటు వరుసగా పంచ్‌లు ఇచ్చాడు. ఆ వ్యక్తి కూడా ప్రతిఘటించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.
కాగా, అక్కడున్న కొందరు వ్యక్తులు వీరిద్దరిని విడిపించేందుకు ప్రయత్నించారు. గాయపడిన ఆ వ్యక్తిని సచిన్ శర్మ వదిలిపెట్టాడు. ఈ ఫైట్ తర్వాత వారిద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అక్కడ రాజీపడ్డారు. ఆర్థిక లావాదేవీల కారణంగా వారి మధ్య వివాదం తలెత్తిందని పోలీసులు తెలిపారు. వారిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారని, సమస్యను పరిష్కరించుకున్నారని చెప్పారు. ఒప్పందం కాపీని స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమర్పించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు బీజేపీ నేత సచిన్ శర్మ ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి పంచ్‌లు ఇచ్చిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 ब्रेकिंग न्यूज़ 🚨 | 📍 झांसी
दबंग नेता ने स्कूटी सवार युवक को जमकर पीटा। कार सवार नेता ने युवक को पीटकर अधमरा किया।
पिटाई का वीडियो सोशल मीडिया पर हुआ वायरल।
मारपीट की वजह अभी तक नहीं आई सामने। सचिन शर्मा मंडल महामंत्री द्वारा की गई मारपीट।
📍 सदर बाजार थाना क्षेत्र का… pic.twitter.com/3vdcawpalO
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 23, 2025