BJP Leader: ఆఫీసులోనే బీజేపీ నేతను కాల్చి చంపేసి.. బైక్‌పై పరారయ్యారు
BJP Leader: ముసుగులో ఆఫీసులోకి వచ్చిన ఇద్దరు తమ వద్ద ఉన్న తుపాకీతో బీజేపీ నేతను కాల్చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఈ కేసులో ముగ్గురు అనుమానితులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన బీజేపీ నేత(BJP Leader) సురేంద్ర మటియాలాను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. తన ఆఫీసులో రాత్రి 7.30 నిమిషాలకు టీవీ చూస్తున్న సమయంలో.. ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చారు. తొలుత సురేంద్రను కొట్టి.. ఆ తర్వాత అయిదు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిని ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అయితే ఈ దాడిలో మొత్తం ముగ్గురు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు ఆఫీసులోకి వెళ్లగా, మరో వ్యక్తి బైక్‌పై ఆఫీసు బయట ఉన్నట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన తర్వాత ముగ్గురూ అక్కడ నుంచి బైక్‌పై పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.
తన తండ్రికి శత్రువులు లేరని పోలీసులతో కుమారుడు తెలిపాడు. నిందితుల్ని అరెస్టు చేయాలని కోరాడు. ఓ ప్రాపర్టీ వివాదంలో బీజేపీ నేత సురేంద్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అయిదు బృందాలు నిందితుల కోసం అన్వేషిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

