లక్నో: బిర్యానీ రెస్టారెంట్లో పని చేసే వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. (Biryani restaurant worker shot dead) అయితే ‘పహల్గామ్ దాడి’కి ఇది ప్రతీకారమంటూ ఒక వ్యక్తి పేర్కొన్నాడు. 26 మంది మరణానికిగాను 2600 మందిని చంపుతామని అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత స్కూటర్‌పై వచ్చిన కొందరు వ్యక్తులు బిర్యానీ రెస్టారెంట్లో పని చేసే గుల్పామ్ అలీ, సైఫ్ అలీపై కాల్పులు జరిపి పారిపోయారు. గుల్పామ్ మరణించగా సైఫ్ గాయపడ్డాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ కాల్పుల సంఘటన తర్వాత ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘పహల్గామ్ ఉగ్రదాడి’కి ప్రతీకార చర్య అని ఒక వ్యక్తి తెలిపాడు. నడుముకు కత్తి, తుపాకీ కలిగిన అతడు మనోజ్ చౌదరిగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు వ్యక్తులను చంపామని, క్షత్రియ గో రక్షా దళ్ దీనికి బాధ్యత వహిస్తుందని చెప్పాడు. ‘26 మందిని చంపినందుకు 2,600 మందితో ప్రతీకారం తీర్చుకోకపోతే, నేను భారత మాత కుమారుడ్ని కాదు. భారత్ మాత పేరుతో ప్రతిజ్ఞ చేస్తున్నా’ అని అన్నాడు.
మరోవైపు వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై పోలీసులు స్పందించారు. గుల్పామ్ అలీ హత్యకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రెస్టారెంట్లో గొడవ వల్ల అతడు హత్యకు గురైనట్లుగా తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. ‘క్షత్రియ గో రక్షా దళ్’ పేరుతో ఏ సంస్థ కూడా ఆగ్రాలో లేదన్నారు. సోషల్ మీడియాలో ప్రచార స్టంట్‌గా కనిపిస్తోందని అన్నారు. ఈ వీడియోలోని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
उत्तर प्रदेश के आगरा में 3 लोगों ने रेस्टोरेंट वर्कर गुलफाम की गोली मारकर हत्या कर दी.फायरिंग में सैफ अली के सीने पर भी गोली के छर्रे लगे हैं. @Uppolice @dgpup @myogiadityanath इन पागलों की सही जगह ऊपर है, इनको खुला नहीं छोड़ते.. आप इन्हें इनकी सही जगह भेजे.. pic.twitter.com/lUOonoqMeg
— अदना सा विमल पाल (@vimalpal94) April 25, 2025