శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 11:40:11

వంట‌గ‌దిలో స్నానం చేస్తున్న ప‌క్షి.. ఎంత‌బాగ ఎంజాయ్ చేస్తుందో!

వంట‌గ‌దిలో స్నానం చేస్తున్న ప‌క్షి..  ఎంత‌బాగ ఎంజాయ్ చేస్తుందో!

ప‌క్షులు, జంతువుల‌కు మ‌నుషులు లేక‌పోయినా ఆనందంగా జీవిస్తాయి. ఒక‌‌సారి వాటి ఆనందానికి అడ్డురాక‌పోతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తాయో ఈ వీడియో చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఆకుప‌చ్చ‌, నీలం, మెరూన్ ఈక‌ల‌తో ఉన్నఈ ప‌క్షి స‌రాస‌రి ఇంట్లోని కిచెన్‌లో స్నానం చేస్తుంది. అది కూడా సింక్ ట్యాప్ వాట‌ర్‌తో జ‌ల‌కాలాడుతున్న‌ది.

నీటిలో త‌డుస్తూ రెక్క‌లు అటూ ఇటూ క‌దిలిస్తూ హాయిగా గ‌డుపుతున్న‌ది. 55 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను వెల్‌క‌మ్ టు నేచ‌ర్ ఖాతా ట్విట‌ర్‌లో షేర్ చేసింది. “నా పక్షి స్నానం కోసం సింక్‌లోకి తీసుకెళ్ల‌మ‌ని వేడుకుంటుంది. అతను తరచూ తన లిల్ పీట్స్‌తో నీటిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు. అక్కడున్న వారెవ‌రైనా ఈ వీడియోను చూసి చిరునవ్వు పొందుతారని ఆశిస్తున్నాను ”అనే శీర్షిక‌ను జోడించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వైర‌ల్ అయి 20 వేల మంది వీక్షించారు.