మరో హైదరాబాద్ టీకా

- బయలాజికల్-ఈ ‘కార్బివాక్స్’కు డీసీజీఐ అనుమతి
- దేశంలో ఆర్బీడీ ప్రొటీన్ ఆధారిత తొలి వ్యాక్సిన్ ఇదే
- కొవొవాక్స్ టీకా, మోల్నుపిరవిర్ గోలీకీ గ్రీన్‌సిగ్నల్
- దేశంలో 8కి చేరిన వ్యాక్సిన్లు, 4కు చేరిన చికిత్సలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేసే క్రమంలో కేంద్రం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్ ఈ’ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా ‘కార్బివాక్స్’కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అభివృద్ధి చేసిన ‘కొవొవాక్స్’ టీకాకు, అమెరికా ఫార్మాసంస్థ మెర్క్ తయారుచేసిన ‘మోల్నుపిరవిర్’ యాంటీ-వైరల్ గోలీకి అనుమతిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు చెందిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ అనుమతులనిచ్చినట్టు డీసీజీఐ తెలిపింది.
కార్బివాక్స్: రిసెప్టార్ బైండింగ్ డొమైన్ (ఆర్బీడీ) ప్రొటీన్ సబ్ యూనిట్ ఆధారంగా భారత్‌లో అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్. కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌లోని ైగ్లెకోప్రొటీన్లో ఉన్న కీలకమైన ఆర్బీడీ ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్ ఈ’ ఈ టీకాను తయారుచేసింది. ఇది రెండు డోసుల టీకా. 28 రోజుల ఎడంతో ఇవ్వాలి. కార్బివాక్స్‌ను బూస్టర్ డోసుగా వినియోగించడంపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు బయలాజికల్ ఈ సంస్థకు డీసీజీఐ అనుమతినిచ్చినట్టు సమాచారం.
మోల్నుపిరవిర్: అమెరికాకు చెందిన మెర్క్ సంస్థ దీన్ని తయారుచేసింది. బ్రిటన్, అమెరికాలో ఇప్పటికే అనుమతి పొందింది. కొవిడ్‌తో బాధపడుతున్న 18 ఏండ్ల పైబడినవారికి, ఆక్సిజన్ స్థాయిలు 93 శాతానికి పడిపోయినవారికి, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి అత్యవసర పరిస్థితుల్లో, వైద్యుల సిఫారసు మేరకే ఈ గోలీని ఇవ్వాలి. రోజుకు 8 డోసుల చొప్పున.. వరుసగా 5 రోజులకు మించి ఈ గోలీలు వాడొద్దు.
కొవొవాక్స్: అమెరికాకు చెందిన నొవావాక్స్ సంస్థ సహకారంతో దేశీయంగా సీరం సంస్థ ఈ నానోపార్టికల్ టీకాను ఉత్పత్తి చేస్తున్నది. ఇది 2 డోసుల టీకా.
ఇప్పటివరకు అనుమతి పొందిన టీకాలు
కరోనా కట్టడికి ప్రస్తుతం 8 వ్యాక్సిన్లు, నాలుగు ఔషధాలు, చికిత్స విధానాలకు అత్యవసర వినియోగం కింద అనుమతులు లభించాయి.
ఒక్క రోజులో 14.4 లక్షల కేసులు
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తున్నది. సోమవారం ఒక్కరోజునే రికార్డు స్థాయిలో 14.4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడానికి ఒమిక్రానే కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నాటికి మొత్తం 653 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 186 మంది కోలుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Corbevax
- DCGI
- Telangana News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

