Kabool Hai | ముజఫర్‌నగర్, ఫిబ్రవరి 10: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. తాను వాట్సాప్ ద్వారా ఒక బాలికను వివాహం చేసుకున్నానని పేర్కొనడమే కాక, అమెతోనే కలిసి జీవిస్తానంటూ యువకుడు పట్టుబట్టాడు. దీనిని ఇరు కుటుంబాల వారు తిరస్కరించారు. ఇంటర్ చదువుతున్న ఈ యువతీయువకులు వాట్సాప్‌లో పరిచయం అయ్యారు.
పరిచయం ప్రేమగా మారింది. ఒక రోజు ఆ యువకుడు ‘వివాహానికి నేను అంగీకరిస్తున్నా’ అన్న మెసేజ్‌ను ఆమెకు మూడుసార్లు పంపగా ఆమె కూడా అదేవిధంగా స్పందించింది. దీంతో ఆమెతో తన పెండ్లి అయిపోయిందని, ఆమె తన భార్యగా భావించడం ప్రారంభించాడు. దీంతోబాలుడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. అతనికి గంటల పాటు పోలీసులు కౌన్సెలింగ్ చేసినా ఆమెయే తన భార్య అంటూ భీష్మించాడు.