ప్యూన్‌గా పనిచేసిన చోటే.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా!
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అన్న విషయం మరోసారి రుజువైంది. బీహార్‌కు చెందిన కమల్ కిశోర్ మండల్ ఎక్కడైతే తాను ప్యూన్‌గా పనిచేశాడో అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. కమల్ తండ్రి రోడ్డు పక్కన చాయ్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
పాట్నా, అక్టోబర్ 14: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అన్న విషయం మరోసారి రుజువైంది. బీహార్‌కు చెందిన కమల్ కిశోర్ మండల్ ఎక్కడైతే తాను ప్యూన్‌గా పనిచేశాడో అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. కమల్ తండ్రి రోడ్డు పక్కన చాయ్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో కమల్ 23 ఏండ్ల వయసులో కాలేజీలో నైట్ సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అయితే డిగ్రీ పూర్తి చేసిన అతడిని డిప్యూటేషన్‌పై తిల్కా మాంజీ భగల్పూర్ యూనివర్సిటీకి 2008లో బదిలీ చేశారు. అక్కడ ‘అంబేద్కర్ ఆలోచన, సామాజిక సేవ’ డిపార్టుమెంట్లో ప్యూన్‌గా చేరాడు.
రోజూ విద్యార్థులు వస్తూ వెళ్తుండటంతో తాను కూడా ఉన్నత చదువులు చదువాలని కమల్ అనుకున్నాడు. యూనివర్సిటీ అనుమతితో ఎంఏ చదివాడు. పీహెచ్డీ కూడా పూర్తి చేశాడు. నెట్ పరీక్ష పాసయ్యాడు. 2020లో యూనివర్సిటీలో ఖాళీ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో కమల్ దరఖాస్తు చేశాడు. ఇటీవల ఫలితాలను వెల్లడించగా కమల్‌కు మంచి మార్కులు వచ్చాయి. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. ఏ డిపార్టుమెంట్లో అయితే ప్యూన్‌గా పనిచేశాడో అదే డిపార్టుమెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

